వైయస్ జగన్ పై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పరోక్ష విమర్శ

రైతు సమస్యలపై ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన చెప్పారు. రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన చెప్పారు. భారీ వర్షాల వల్ల, తుఫాను వల్ల రైతులు నష్టపోయారని వారిని ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. శాఖల కేటాయింపులపై మంత్రులు అసమ్మతి వ్యక్తం చేయడంపై తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. శాఖల కేటాయింపుల్లో ప్రాధాన్యత అంటే ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్ హయాంలో కొనసాగిన దోపిడీనే తిరిగి కొనసాగించాలనేదే ప్రాధాన్యతనా అని ఆయన అడిగారు. శాఖల కేటాయింపులపై గొడవలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన మంత్రులకు సూచించారు.












Click it and Unblock the Notifications