ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చినా వన్నె తెస్తా: శంకరరావు

ముఖ్యమంత్రితో మంత్రులందరూ అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడగా శంకరరావు మాత్రం చేనేత శాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో రాష్ట్రంలోని చేనేత పరిస్థితులపై నివేదిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతేకాదు అసంతృప్తులను కూడా ఆయన సమర్థించలేదు. ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చారని ఇలా పత్రికలకెక్కడాన్ని ఆయన ఖండించారు. అసంతృప్తులు ఇలా రాద్దాంతానికి దిగడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications