గుంటూరు జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి 11 మంది మృతి

సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే బాపట్ల డీఎస్పీ కె.ఉదయభాస్కర్‌రెడ్డి, సి.ఐ. మహబూబ్ బాషా, చంద్ లు ఎస్సై షేక్ హుస్సేన్ తమ సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి రూరల్ ఎస్పీ ఎ.రవిచంద్ర, తెనాలి ఆర్డీవో షేక్ ఇస్మాయిల్‌లు పరిశీలించారు. మండలంలోని కోమలి గ్రామస్థులు కొందరు ఓ శుభకార్యానికి వెళ్లొస్తున్న ట్రాక్టరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిజాంపట్నం ఛానల్‌లో బోల్తాపడి ఏడుగురు మృతిచెందారన్న సమాచారం తెలియగానే పి.వి.పాలెం గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్తనాదాలు చేస్తున్న మహిళలను రక్షించారు. ఇటీవల కాలంలో కాలువల్లో వాహనాలు ప్రమాదాలకు గురి కావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ్వుతూ తుళ్లుతూ తమ ఆడబిడ్డను కాపురానికి పంపించేందుకు వెళ్లి తిరిగి వస్తూ ఈ ప్రమాదం జరగడంతో కోమలి గ్రామం సోకసంద్రంలో మునిగింది. జిల్లా జాయింట్ కలెక్టరు ఎ.శరత్ సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications