చిరంజీవి అయోమయం జగన్నాథం, ఆశానిరాశలతో ఊగిసలాట

మధ్యంతర ఎన్నికలను నివారించాల్సిన ఆగత్యం చిరంజీవి పార్టీకి ఉందనే విషయం ఎవరూ కాదనలేని సత్యం. మధ్యంతరం వస్తే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రభుత్వంలో చేరడం, చేరకపోవడం మీద ఇంతగా ఊగిసలాడాల్సిన అవసరం లేదు. తమ పార్టీకి చెందిన 18 మంది శాసనసభ్యులను కూడా చిరంజీవి ఒక తాటి మీద నిలబెట్టలేకపోతున్నారు. శోభానాగిరెడ్డి దాదాపుగా వైయస్ జగన్ వర్గంలో చేరిపోయినట్లే. మరో ఆరుగురినో, ఏడుగురినో కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రభావితం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవులు దక్కించుకున్నవారు తప్ప మిగతా వారంత శిబిరం మార్చే ప్రమాదం ఉంది.
మొత్తంగా పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే చర్యలేవీ చిరంజీవి చేపట్టకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది. కాంగ్రెసు అనుకూల వైఖరి కూడా ఆయనను బలహీనపరిచింది. ఈ విషయంలో ఆయన పూర్తిగా తన బావమరిది అల్లు అరవింద్ కు లొంగిపోయారనే విమర్శలున్నాయి. వైయస్ జగన్ పార్టీ వస్తే ప్రజారాజ్యం పార్టీ మరింతగా బలహీనపడే ప్రమాదం ఉంది. దాని నుంచి రక్షించుకోవడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలేవీ లేవు.












Click it and Unblock the Notifications