వికలాంగులపట్ల జాలి వద్దు, అవకాశాలు కల్పించాలి: సిఎం కిరణ్

సచివాలయానికి వచ్చిన వికలాంగులు పై ఫ్లోర్ వరకు రావడానికి ఇబ్బందులు ఉన్న కారణంగా వారి కోసం క్రిందనే పిటీషన్లు తీసుకునే ఏర్పాటు చేస్తానన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన ఈ 20 సంవత్సరాలుగా నా వద్దకు వికలాంగులు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వస్తుంటారన్నారు. వికలాగులుగా పుట్టడానికి మేనరికం, ప్రసవం సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ముఖ్య కారణాలు అని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామీణులను మేనరికం పెళ్లిల్లు చేసుకోకుండా చైతన్యపరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వికలాంగుల పింఛన్లకోసం దేశంలోని ఏ ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. వికలాంగులకు స్టడీ సర్కిల్స్ లో ప్రత్యేక రాయితీ కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications