కె చంద్రశేఖరరావు, కోదండరామ్ లపై చైర్మన్ గద్దర్ ఫైర్

తెలంగాణ కోసం పార్లమెంటులో యుద్ధం ప్రకటించాల్సిందిగా గద్దర్ కెసిఆర్ కూ సూచించారు. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు తెలంగాణకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాజకీయ ఐకాసలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. తెలంగాణ సాధనలో రాజకీయ ఐకాస పూర్తిగా విఫలమైందన్నారు.
కాగా తెరాస శాసనసభ్యులు, రాజకీయ ఐకాస శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వేరువేరుగా కలిశాయి. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాల్సిందిగా వారు కోరారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలన్నారు. కాగా డిజిపి అరవిందరావు విద్యార్థులను విడిపించే బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు.












Click it and Unblock the Notifications