కర్ణాటక ఐటి మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు రాజీనామా

బెంగళూర్ నగర శివార్లలోని బండికొడిగె హళ్లి వద్ద ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు తమ సంస్థ ఇటాస్క సాఫ్ట్‌వేర్‌కు అనుమతి మంజూరుకు కట్టా సుబ్రహ్మణ్యం కుమారుడు కట్టా జగదీశ్ 2006 ఆగస్టులో కర్ణాటక ఉద్యోగ మిత్రకు దరఖాస్తు చేశారు. అది లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న ఉన్నతస్థాయి సమితి పరిశీలనకు పంపాలని మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప దాన్ని ఆమోదించారు. తదుపరి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడి అధీనంలోని పరిశ్రమల శాఖలోని పలు విభాగాలు దరఖాస్తును పరిశీలించి భూ వితరణకు పచ్చ జెండా వూపాయి. దీంతో 2007 మేలో భూ సేకరణకు ఇటాస్క, కెఐఏడీబీ మధ్య అవగాహన కుదిరింది.
భూముల స్వాధీనానికి రైతుల్ని ఒప్పించేందుకు బినామీ సంస్థ ఇందు బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కు రూ. 67 కోట్లు అక్రమంగా చెల్లించారు. దీనికి సంబంధించి మరిన్ని అంశాలపై తనిఖీ జరుగుతోంది. ఈ వ్యవహారంలో పరిశ్రమల శాఖ, కెఐఏడీబీ అధికార్లు ఫోర్జరీ, దాఖలాల తారుమారు, ఇతర అనేక అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త అధికార్లు విపులీకరించారు. లోకాయుక్త అధికార్లు ఈనెల 2న ఇందు బిల్డర్స్ సంస్థ ఉండాల్సిన సౌభాగ్య పెట్రోలు బంకు, ఇటాస్క సాఫ్ట్‌వేర్, యునైటెడ్ టెలికాం కంపెనీ ఆవరణల్లో దాడులు జరిపి కీలక దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అదనపు డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications