డైలమాలో కెటిఆర్, రమేశ్ ఎన్నిక: బుధవారానికి తీర్పు వాయిదా

తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 10 మంది శాసనసభ్యులతో పాటు, వేములవాడ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్, నిజామాబాద్ అర్బన్ కు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు మొత్తం పన్నెండు మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ పన్నెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించింది. అయితే సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎన్నికపై కేసు హైకోర్టులో ఉంది. ఆ రెండు స్థానాలను మినహాయిస్తూ మిగతా స్థానాల ఎన్నికకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ రెండు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ రెండు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్, సిరిసిల్ల నుంచి కెటి రామారావు గెలిచారు. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వారి ఎన్నికపై సందేహాలు అలుముకున్నాయి.
కేసు విచారణలో ఉండగా ఎన్నికలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం తాజాగా చెప్పడంతో ఇప్పుడు వారి ఎన్నిక సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ఎన్నికలు అయిపోయినందున మరోసారి ఇలాంటివి జరగకుడని సుప్రీంకోర్టు చెబుతుందా, లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని చెబుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications