సిఎం బూట్ పాలిష్ కు తెలంగాణ కాంగ్రెసు నేతల క్యూ: కెసిఆర్

శ్రీకృష్ణ నివేదిక అనంతరం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రకటించడానికి 15 రోజులు గడువు ఇస్తామని ఆయన చెప్పారు. అప్పటికీ తెలంగాణకు అనుకూలంగా లేనట్లయితే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుందని గవర్నర్ నరసింహన్ వెటకారపు వ్యాఖ్యలు చేస్తున్నారని, గవర్నర్ అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ చిల్లరమల్లర వ్యవహారం కాదని గవర్నర్, ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. లా ఆండ్ ఆర్డర్ గట్టిగా ఉంటుందన్న ముఖ్యమంత్రి అధిష్టానం చెప్పిన తెలంగాణకు కూడా కట్టుబడి ఉండాలన్నారు.
డిజిపి ఆనందరావు ఎక్కువగా మాట్లాడుతున్నారని దానిని తగ్గించుకోవాలని హెచ్చరించారు. మమ్మల్లి రబ్బరు బుల్లెట్లు కాదు ఇనుప బుల్లెట్లు కూడా ఏం చేయలేవన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చవటలు, దద్దమ్మలు అని ధ్వజమెత్తారు. తెలంగాణకు వారే ప్రమాదకరమన్నారు. శ్రీకాంత్ చారి సొంత గ్రామమైన వరంగల్ జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేరులో కెసిఆర్ శ్రీకాంత్ చారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications