జగన్ తాతలు దిగి వచ్చినా కాంగ్రెసు కు నష్టం లేదు: పాల్వాయి

Palwai Govardhan Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాతలు దిగి వచ్చినా కాంగ్రెసు పార్టీకి నష్టం లేదని కాంగ్రెసు సీనియర్ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన కాంగ్రెసు ఏ మాత్రం దెబ్బతినదన్నారు.

జగన్ కొత్త పార్టీ పెడితే వెళ్లడానికి ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమయం కాదన్నారు. ఆయన పెట్టిన సమయం వేరు ఇప్పుడు వేరు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలంతా ఆయన వెంట నడిచినట్టు జగన్ వెంట వెళతారనుకుంటే పొరపాటు అన్నారు. కాంగ్రెసు పార్టీనుండి జగన్ పార్టీ వైపు ఎవరూ వెళ్లరన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఆరోవేలుతో సమానమని ఆయన అన్నారు. తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా సమస్య లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+