పెళ్లికి అంగీకరించలేదని నిప్పంటించాడు: వివాహేతర సంబంధమే కారణం

Anantapur
అనంతపురం: అనంతపుర్ లో మహిళపై కిరోసిన పోసి నిప్పంటించిన ఘోర దుర్ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని లేపాక్షి మండలం మైదుగోలం గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. వెంకటప్ప అనే యువకుడు భారతి అనే వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. వెంటనే గ్రామస్తులు ఆమెను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితిపై డాక్టర్లు ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నారు. స్థానికులు అక్కడే ఉన్న భారతి పాపను రక్షించారు.

మైదుగోలానికి చెందిన భారతి అనే వివాహిత మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు వెంకటప్ప అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా వెంకటప్ప భారతిని పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ఆమె అంగీకరించలేదు. భారతికి వెంకటప్పతో కాకుండా మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసిన వెంకటప్ప తనతో పెళ్లికి సైతం ఒప్పుకోక పోవటంతో ఆగ్రహించి ఉదయం ఆమెపై కిరోసిన పోసి నిప్పంటించాడు. ఉదయం వారిద్దరికి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+