వైయస్ పథకాలు కొనసాగించడానికే మంత్రి పదవి: వివేకానంద
Districts
oi-Srinivas G
By Srinivas
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలు కొనసాగించాలనే మంచి ఉద్దేశ్యంతో తాను మంత్రి పదవి చేపట్టినట్టు వ్యవసాయశాఖ మంత్రి, వైయస్ఆర్ సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి శుక్రవారం అన్నారు. రాజశేఖరరెడ్డి ఇష్టమైన వ్యవసాయ శాఖను ఇష్టపడి హైకమాండ్ ను సంప్రదించి వారి అనుమతితో తీసుకున్నానన్నారు. ఇన్నాళ్లుగా నిధుల లేమి కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందన్నారు. అయితే ఇకనుండి దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. వైయస్ కలలు కన్న వ్యవసాయాన్ని వృద్ధి చేసే దిశలో కృషి చేస్తానని వివేకానంద అన్నారు.