పులివెందులలో పాగాకు అప్పుడే వైయస్ వివేకానంద ప్రయత్నాలు

జగన్ కడప పార్లమెంటు సభ్యత్వానికి, దివంగత వైయస్ సతీమణి విజయలక్ష్మి పులివెందుల నియోజగవర్గానికి రాజీనామా చేసినందన అక్కడ ఉప ఎన్నికల నేపథ్యంలో వివేకా ముందుగానే తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన కడపకు వెళ్లి తమ బంధువులను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ఆయన కడప జెఎన్టీయులో ఉన్న దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి, కడప బస్టాండ్ లో ఉన్న దివంగత వైయస్, ఇందిరాగాంధీల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వివేకా జిల్లా అధికారులతో కూడా భేటీ కానున్నారు. ఇంతకుముందు పులివెందుల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించినందున వివేకాకు గట్టి పట్టు ఉంది. అంతేకాకుండా 1991లో వైయస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా తన శాసనసభ్యత్వానికి సైతం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వివేకాను నియోజకవర్గంలో గట్టి పట్టుతోపాటు మంచి పేరు ఉంది. పార్టీ ఆదేశిస్తే పులివెందులనుండి పోటీ చేయడానికి కూడా సిద్ధమని వివేకా ఇప్పటికే ప్రకటించారు. జగన్ సైతం రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికి పులివెందులనుండి పోటీ చేయడమనేది తథ్యం.












Click it and Unblock the Notifications