హైదరాబాద్: సోమవారం బ్లాక్‌డే సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య - బాబ్రీ వివాదం కారణంగా గత కొన్నేళ్లుగా బ్లాక్ డే పాటిస్తున్నారు. అయితే ఇటీవల అలహాబాద్ కోర్టు అయోధ్య విషయంలో తీర్పు చెప్పినప్పటికీ కొన్ని ముస్లిం వర్గాలు బ్లాక్ డేను పాటిస్తామని ప్రకటించారు. దీంతో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీ అయిన ఎం.ఐ.ఎం. కూడా బ్లాక్ డే పాటిస్తామన్నారు. పాతబస్తీకి ఇప్పటికే అదనపు బలగాలను తరలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. నాలుగు కంపెనీల ఆర్‌ఏఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం శాంతి సంఘాలు, యువజన సంఘాల సహకారం తీసుకుంటున్నామన్నారు.