వైయస్ విజయలక్ష్మి రాజీనామాను ఆమోదించిన డిప్యూటీ స్పీకర్

Nadendla Manohar
హైదరాబాద్: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి రాజీనామాను శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ బుధవారం ఆమోదించారు. ఇటీవల తన తనయుడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో పాటు విజయలక్ష్మి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సభాపతి లేనందున ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదించారు.

తనను కాంగ్రెసు అధిష్టానం ఒంటరిని చేసి బయటకు పంపించాలనుకుంటుందని, అందుకు తానే ఒంటరిగా బయటకు వెళుతున్నానంటూ జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తన పార్లమెంటు సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. జగన్ కడపలో ఉన్న తన తల్లిని సైతం హైదరాబాదుకు పిలిపించి తనతో పాటుగా పులివెందుల నియోజకవర్గానికి ఆమెతో రాజీనామా చేయించారు. జగన్ రాజీనామాను లోకసభ సభాపతి మీరాకుమార్ రాజీనామా ఇటీవలే ఆమోదించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+