రాష్ట్రంలో చేతకాని మొద్దు ప్రభుత్వం: చంద్రబాబు నాయుడు

వరి, పత్తి పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు శాసనసభలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురంలో పంట నష్టపోవటంతో చనిపోయిన రైతు మర్రి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.20వేల రూపాయల నష్టపరిహారం అందించారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పర్యటించి రైతులను వారి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా సూక్ష్మ రుణాలు ఎవరూ చెల్లించవద్దని ప్రజలకు చంద్రబాబు సూచించారు. సూక్ష్మ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. కాగా నల్గొండ జిల్లా పర్యటన అనంతరం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications