స్పీకరుగా నాదెండ్ల, ప్రభుత్వ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?

ఇప్పటి వరకు శాసనసభ ఉపసభాపతిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కు ప్రమోషన్ ఇస్తూ ఆయనను సభాపతి స్థానంలో కూర్చుండబెడతారని తెలుస్తోంది. అలాగే ఉపసభాపతిగా ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను, ప్రభుత్వ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా పిసిసి అధ్యక్షుడి పదవి ఖరారు కావడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications