తెరాస ఎమ్మెల్యేల ఆందోళన, అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా

అన్ని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విద్యార్థులపై పెట్టిన కేసుల మీద హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శాసనసభా సంప్రదింపుల కమిటీ (బిఎసి)లో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సమస్యలపై చర్చను ప్రారంభిద్దామని ఆయన సూచించారు. అయినా తెరాస సభ్యులు వినలేదు. ఎజెండా ప్రకారం సభా కార్యక్రమాలు నిర్వహించుకుందామని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. అయినా తెరాస సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభను పదిహేను నిమిషాలు పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications