మందకృష్ణ దీక్ష విరమించి చర్చలకు వస్తే ఢిల్లీకి అఖిలపక్షం: పితాని

కాగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం ధ్వజమెత్తారు. పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత కూడా వర్గీకరణపై ప్రభుత్పం ఎందుకు ఇంతగా దానిని నాన్చుతుందో తెలియజేయాలన్నారు. అఖిలపక్షాన్ని ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండు చేశారు. వర్గీకరణపై ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. మందకృష్ణ ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications