మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష విరమణ

అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రులు పితాని, దామోదర రాజనర్సింహ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ, ఎస్సీల వర్గీకరణకు సంబంధించి జనవరి 31లోగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లనున్నట్టు ప్రకటించారు. వీలైతే అంతకన్నా ముందుగానే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో దీక్ష విరమించాల్సిందిగా మంద కృష్ణమాదిగకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రకటనతో గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కృష్ణమాదిగ దీక్ష విరమించారు. ఆయనకు మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మంద కృష్ణ మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వర్గీకరణ విషయమై కొంత సమయం కేటాయించాల్సి ఉన్నందున దీక్ష విరమిస్తున్నానన్నారు.
మంద కృష్ణ దీక్షలకు మద్దతుగా ఇక్కడి ఎల్బీ నగర్‌లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లాక్ష్యాన్ని నిరసిస్తూ ఇద్దరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని పోలీసులు వారించారు.












Click it and Unblock the Notifications