పేర్ని నాని వ్యవహారంపై లడగపాటి రాజగోపాల్ తో కిరణ్ చర్చలు

Kiran Kumar Reddy
విజయవాడ: తాను వైయస్ జగన్ తో ఉంటానని శాసనసభ్యుడు పేర్ని నాని ప్రకటించడంతో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వైయస్ జగన్ వెంట కొత్తగా ఎవరూ వెళ్లరని, వెళ్లేవారు ఇప్పటికే ఖరారై పోయారని భావించిన కాంగ్రెసు నాయకత్వానికి పేర్ని నాని ప్రకటన ఓ షాక్ ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నానితో మాట్లాడాల్సిందిగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి రెండుసార్లు లగడపాటితో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ వెంట ఇంకా ఎవరైనా వెళ్లే అవకాశాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిన వెంటనే లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ వచ్చారు. తాను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి రాలేదని, చెన్నైకి పెళ్లికి వెళ్తూ ఇక్కడ ఆగానని రాజగోపాల్ చెప్పారు. అయితే అసలు విషయం మాత్రం కృష్ణా జిల్లా రాజకీయాల గురించేనని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో పేర్ని నాని తీవ్ర ఆసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పైగా, ఇటీవలి కృష్ణా జిల్లా పర్యనటలో కిరణ్ కుమార్ రెడ్డి కనీసం నానిని పలకరించలేదని తెలుస్తోంది. దీనికి ఆయన తీవ్రంగా కలత చెందినట్లు భావిస్తున్నారు. దీంతోనే తాను వైయస్ జగన్ వెంట ఉంటానని ప్రకటించినట్లు చెబుతున్నారు. నాని పార్టీతోనే ఉంటారని కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పార్థసారధి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+