2జి స్పెక్ట్రం కుంభకోణంపై నిప్పులు చెరిగిన ఎల్ కె అద్వానీ

2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని అద్వానీ డిమాండ్ చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ గానీ, ఎన్డీయే పార్టీలుగానీ వెనక్కి తగ్గేది లేదన్నారు. జేపిసి వేసేదాకా పోరాటం చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన కుంభకోణాల్లోకెల్లా 2జి కుంభకోణం చాలా పెద్దదన్నారు. 2జి కుంభకోణంపై జెపిసికి పట్టుబడితే ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. మరో మార్గం లేకే పార్లమెంటును స్తంభింప చేశామన్నారు.
పార్లమెంటు ప్రతిష్టంభనకు యూపిఏ ప్రభుత్వమే కారణమన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2జి కుంభకోణంపై పార్లమెంటును స్తంభింప చేస్తామన్నారు. జేపిసికీ యూపిఏలోని కొన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయన్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఒంటరి పక్షం అయ్యిందన్నారు. ప్రభుత్వం జెపిసినుండి మాత్రం తప్పించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications