కేంద్ర ప్రభుత్వం అవినీతిపై దేశవ్యాప్త ఆందోళన: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అవినీతిపై ప్రజల్లోకి తీసుకెళతామని, అందుకు మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో త్వరలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అన్నారు. చంద్రబాబు బుధవారం సాయంత్రం 5 గంటలకు సీపీఐ కార్యాలయం మగ్దూంభవన్‌లో సీపీఎం నేత ప్రకాష్‌కారత్‌, సీపీఐ నేత ఏబీ బర్దన్‌లతో ఆయన భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు ఓంప్రకాష్‌చౌతాలాతో భేటీ కానున్నారు.

జాతీయ నాయకులతో చర్చ అనంతరం బాబు మాట్లాడారు. 2 జి స్పెక్ట్రంపై ప్రభుత్వం జెపిసి వేయకుండా కాలాయాపన చేస్తుందని చంద్రబాబు అన్నారు. కాలాయాపన ఎందుకు చేస్తుందో ప్రధానమంత్రి మన్మోహన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవినీతిపై రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. పెట్రో ధర పెంపు సామాన్య ప్రజల నడ్డి విరిచినట్లేనన్నారు. పెట్రో ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

భావసారుప్యంగల పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తామని ప్రకాశ్ కరత్ అన్నారు. 2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని ఆయన అన్నారు. జేపిసి వేయకపోవడానికి గల కారణాలు ప్రధాని చెప్పాలన్నారు. కేంద్రం పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుందన్నారు. ప్రభుత్వంలో కూడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+