వైయస్ జగన్ కు సై అన్న మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడిందన్నారు. రంగులు మార్చే ఊసరవెల్లులు పార్టీకి కావాలని కాంగ్రెసు అభిప్రాయ పడుతుందని కాని అలాంటి వారి అవసరం లేదని పార్టీ తెలుసుకోవాలన్నారు. జగన్ ఒక్కడే రాష్ట్రాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించగలడని అన్నారు. ఇపుడు జక్కంపూడి రాజీనామాతో జిల్లాలో కాంగ్రెసు పార్టీలో కీలక నేత దూరమవు తున్నారు.
అనారోగ్యంతో మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆయన కుటుంబం కాంగ్రెసు పార్టీలో క్రియాశీల పాత్రపోషిస్తోంది. జక్కంపూడి రాజకీయ వారసులుగా ఆయన భార్య విజయలక్ష్మి, తనయుడు రాజా ఇప్పటికే జగన్ వర్గంలో కీలకంగా ఉన్నారు. జక్కంపూడి రాజీ నామా తర్వాత కాంగ్రెసు పార్టీలో ఉన్న మరికొంతమంది జక్కంపూడి అనుచరులు కూడా ఈయన బాట లోనే నడిచేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications