రెండో రోజుకు నిరాహార దీక్ష: పట్టు వీడనంటున్న చంద్రబాబు

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు పది వేల రూపాయల చొప్పున, వాణిజ్య పంటలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. బీమా ద్వారా ఉపశమనం కల్పించాలని కూడా ఆయన కోరుతున్నారు. తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబుకు సంఘీభావంగా ఆయన కుమారుడు లోకేష్ కాసేపు దీక్షలో కూర్చున్నారు.












Click it and Unblock the Notifications