సొంత మీడియా ఉందనే: వైఎస్ జగన్ పై బొత్స సత్యనారాయణ విసుర్లు

చనిపోయిన వ్యక్తిపై రాజకీయాలు చేయడం వారికే చెల్లిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. వైఎస్ ను కించపరిచే వార్తలు వద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ను తలచని రోజు లేదన్నారు. వైఎస్ తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో మేం అందరమూ భాగస్వాములన్నారు. అందరము కలిసి పని చేస్తామన్నారు. కొందరు చేసే తాటాకు చప్పుళ్లకు మేం బెదిరేది లేదన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బాబుకు అప్పుడు రైతు గుర్తుకు రాలేదన్నారు. అసలు ఆయనకు రైతుల సమస్యలపై అవగాహన లేదని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications