చంద్రబాబుకు పోరు కుదరదు, ఎవరూ నమ్మరు: కె. చంద్రశేఖర రావు

తెలంగాణపై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సాక్షిగా ప్రమాణాలు చేసిన కాంగ్రెసు తెలంగాణ నాయకులు మాట తప్పారని ఆయన విమర్శించారు. డిజిపి అరవింద రావు ప్రకటనను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. అరవింద రావు చెప్పాల్సింది అరవింద రావు చెప్పారని, చేయాల్సింది చేస్తారని, తెలంగాణ ఉద్యమకారులు చేయాల్సింది చేస్తారని, చెప్పాల్సింది చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అరవింద రావు మాట్లాడారని అనుకోవడం లేదని, సీమాంధ్రలో కూడా ఉద్యమాలు తలెత్తవచ్చునని, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండవచ్చునని ఆయన అన్నారు. అయితే అరవింద రావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఉద్యమం ఎలా చేయాలో తమకు తెలుసునని ఆయన చెప్పారు. హింస, విధ్వంసం ఉండవని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థను ఎలా స్తంభింపజేయాలో తమకు తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వరి మంటలాగా మండి చల్లారిపోయేదని కాదని, లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఆగదని ఆయన చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణవారు సహనశీలురని, తెలంగాణపై కమిటీ అవసరం లేదని, అయినా తెలంగాణవారు సహనం వహించారని ఆయన చెప్పారు. ఉద్యమ నిర్మాణంపై ఈ నెల 24వ తేదీన విస్తృతంగా చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ బలగాలు కూడా ఏమీ చేయలేరని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఫలితాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయని ఆయన అన్నారు. మజ్లీస్ నేత అక్బరుద్దీన్ చాలా చిన్న మనిషి అని, పైసలు లేకుండా అక్బరుద్దీన్ పార్టీ ఎలా నడుస్తుందని, గాలిలో నడుస్తోందా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తాయని ఆయన అన్నారు. పనికి రాని మాటలు మాట్లాడితే ప్రజల్లో పలుచనై పోతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications