ఎఐసిసి ప్లీనరీ: సోనియాపై ఒత్తిడికి తెలంగాణ నేతల ఒత్తిడి

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందా, వ్యతిరేకంగా ఇస్తుందా అనే అనుమానాలున్నాయని, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా, ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో డిజిపి అరవింద రావు చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు తమ పరిధిలో ఉండాలని ఆయన సూచించారు. డిజిపి భయాందోళనలకు గురి చేసేలా, తెలంగాణలో ఏమో జరుగుతుందన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అన్నారు.












Click it and Unblock the Notifications