శ్రీకృష్ణ కమిటీపై వ్యాఖ్యలకు కె కేశవరావుపై అధిష్టానం సీరియస్

నివేదిక వచ్చే వరకు పార్టీ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. నిబద్దత వ్యక్తులపై దూకుడుగా మాట్లాడడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల శ్రీకృష్ణ కమిటీపై కె కేశవరావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కమిటీపై కేశవరావు ఘాటుగానే స్పందించారు. కమిటీ తను వచ్చిన పని చేసుకొని పోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, గవర్నర్ నరసింహన్ ను కలిసి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. శాంతిభద్రతలపై మాకు కమిటీ సభ్యులు చెప్పాల్సిన పని లేదన్నారు. దేశభక్తిపై వారు మాకు చెప్పవలసిన పని లేదని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యాఖ్యలపైనే అధిష్టానం సీరియస్ గానే స్పందించి కెకె కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications