ఆరో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష: మరింత క్షీణించిన ఆరోగ్యం

Chandrababu Naidu
హైదరాబాద్‌: రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ఆరో రోజుకు చేరింది. ఆరో రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని, ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. తక్షణం నరం ద్వారా సెలైన్‌, ద్రవాహారం ఎక్కించాలని, కనీసం ఏదైనా తాగడం చేయాలని వైద్యులు చంద్రబాబును బలవంతపెట్టారు. ఇందుకు చంద్రబాబు గట్టిగా నిరాకరించారు. మంగళవారం చంద్రబాబుతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

రైతుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం, ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. రైతాంగం ఇప్పటికే ఉద్యమంలో పాల్గొంటుందని, వారందరితో కలిసి బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్లను దిగ్భంధించాలని నిర్ణయించారు. ఈ దిగ్భంధనం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్‌ నేతలను వివిధ జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు.

ఆదిలాబాద్‌కు ఎల్‌.రమణ, నిజామాబాద్‌ కు వేణుగోపాలాచారి, కరీంనగర్‌ అరికెల నర్సారెడ్డి, మెదక్‌ మండవ వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి వర్ల రామయ్య, ప్రకాశం కోడెల శివప్రసాదరావు, నెల్లూరు ముద్దుకృష్ణమనాయుడు, కడప బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, అనంతపురం బాబూ రాజేంద్రప్రసాద్‌, గుంటూరు కరణం బలరామకృష్ణమూర్తి, కాగిత వెంకట్రావు, మెదక్‌ మండవ వెంకటేశ్వరరావు, విశాఖపట్నం కళా వెంకట్రావు, విజయనగరం చిక్కాల రామచంద్రరావు - ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరిని పరిశీలకులుగా పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+