మూకుమ్మడి రాజీనామాల దిశగా టిడిపి శాసనసభ్యులు?

గురువారం తెలుగుదేశం శాసనసభ్యులు మూకుమ్మడిగా స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. రైతులను ఆకట్టుకోవడానికి అంతకు మించి కార్యక్రమం లేదని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు గురువారం ఉదయం టిడిఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత వారు రాజీనామాలు చేస్తారని అంటున్నారు. దాంతో చంద్రబాబు దీక్ష విరమిస్తారని అంటున్నారు. రాజీనామాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని కూడా తెలుగుదేశం నాయకులు ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications