వైద్యులు రాకుండా గది తలుపులు వేసుకున్న చంద్రబాబు

బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వైద్యులు కోర్టు ఆదేశాలతో చంద్రబాబు గది వద్దకు వెళ్లారు. అయితే చంద్రబాబు వారిని లోనికి రానీయలేదు. చికిత్స నిరాకరిస్తే చంద్రబాబుకు గుండె సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించి, ప్రజల్లోకి వెళ్లాలని వారు సూచిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు చంద్రబాబు అంగీకరించడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications