దీక్ష విరమించడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారు: ఎర్రబెల్లి దయాకర రావు

Chandrababu Naidu
హైదరాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తన నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఖచ్చితంగా చెబుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం విలేకరులతో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన అంటున్నారు. ప్రభుత్వం దీక్ష విరమణపై పెట్టే దృష్టి రైతుల సమస్యలను పెట్టాలని సూచించారు.

ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవటం లేదని, వారిపట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం రైతులకు సరిపోతే ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+