జగన్ దీక్షకు వెళ్లకుండా ఎమ్మెల్యేల కట్టడి: వెనక్కి మళ్లిన పేర్ని నాని

Congress
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే కాంగ్రెసు శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసు లో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని లేదంటే తీవ్రంగా రాజకీయ భవిష్యత్తును నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. విజయవాడలో లక్ష్యదీక్ష చేస్తున్న వైయస్ జగన్ కు మద్దతు తెలపడానికి మంగళవారం 23మంది శాసనసభ్యులు వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి కొందరు శాసనసభ్యులు మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారు.

శాసనసభ్యులు చేజారి పోకుండా కాంగ్రెసు అధిష్టానం వారని బుజ్జగించటం, అయినా వినకుంటే హెచ్చరించటం వరకు వెళుతోంది. జగన్ కు మద్దతు తెలిపే శాసనసభ్యులచే ఆయా జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులు, మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు అధిష్టానం ఫోన్ లు చేపిస్తున్నట్టు తెలుస్తోంది. వారని జగన్ కు మద్దతుగా వెళ్లకూడదని కోరుతుంది. బందరు శాసనసభ్యుడు పేర్ని నాని కూడా బుధవారం జగన్ కు మద్దతు తెలపడానికి బయలుదేరిన సమయంలో ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేయించారు. దీంతో ఆయన సగంలోనే వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+