మీరు ఊహించినట్లు జరగదు: జగన్ పై మీడియా వ్యాఖ్యలకు డిఎస్ స్పందన

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన తన దీక్షను విరమించుకోవాలని ఆయన కోరారు. రైతులకు ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందించిందని, మరింత అందించడానికి కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు దీక్ష విరమించి ప్రభుత్వంతో రైతుల సమస్యలపై చర్చించి తగు సూచనలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలపై చంద్రబాబు ఉద్దేశ్యం ఏంటో ప్రజలకు, ప్రభుత్వానికి అర్థమయిందన్నారు. చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం అన్నారు. తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రాణాలు రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం అన్నారు. సమస్యలు చెప్పటంలో తప్పులేదు. కానీ నిరాహార దీక్ష అనేది సరికాదన్నారు.












Click it and Unblock the Notifications