శ్రీకృష్ణ నివేదిక అనుకూలంగా లేకపోతే నిరాహార దీక్ష: కెసిఆర్

K Chandrasekhar Rao
మహబూబ్ నగర్‌: శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకపోతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపడ్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి, తదితర నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెసు తెలంగాణ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే ఏడాది జనవరి నుంచి సహాయ నిరాకరణ, మిలిటెంట్ పోరాటాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం జరిగే అంతిమ పోరాటానికి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. గత 54 ఏళ్లుగా తెలంగాణ అస్తిత్వ పోరాటం జరుగుతూనే ఉన్నదని ఆయన చెప్పారు.

సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు చవటలు, దద్దమ్మలు అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన తెలంగాణ కాంగ్రెసు తెలంగాణ నాయకుల వల్లనే వెనక్కి పోయిందని ఆయన విమర్సించారు. తెలంగాణకు నీళ్లు, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై, విద్యార్థులపై పెట్టిన కేసులపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు స్పందించడం లేదని, విద్యార్థుల శవాలపై శపథాలు చేసిన వారు రాజీనామాలు చేయకుండా తప్పుకున్నారని, వారిని చవటలు, దద్దమ్మలు అనకపోతే ఏమంటామని ఆయన అన్నారు. తాము ఎవరిదీ అడగడం లేదని, తమ తెలంగాణ తమకు కావాలంటున్నామని, సీమాంధ్ర నాయకులు తమది తమకే ఇతరులదీ తమకే కావాలంటున్నారని ఆయన అన్నారు. తాను నిరాహార దీక్ష చేసినప్పుడు ఊళ్లు ఉద్యమాలకు వేదికలయ్యాయని, విశ్వవిద్యాలయాలు యుద్ధభూములయ్యాయని, దాంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తన్నట్లు కేంద్రం ప్రకటించిందని, వచ్చిన తెలంగాణ సీమాంధ్ర నాయకుల వల్ల వెనక్కి పోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+