ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నిరాహార దీక్షల తలనొప్పి

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రాష్ట్ర సమస్యలకు తోడు ఆందోళనలు ఆయనను ఊపిరి సలపనీయడం లేదు. దీంతో ఆయన సతమతమవుతూనే ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఆందోళనలు ఓ వైపు ఉంటే, ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతమయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి నిరవధిక నిరాహార దీక్షకు తోడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ 48 గంటల లక్ష్యసిద్ధి దీక్ష ఆయనకు తలనొప్పిగా మారాయి. మరోవైపు తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత వివాదం ముడి వీడని చిక్కు సమస్యగా మారింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ చర్లపల్లి జైలులో ఉన్న విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. దీంతో ఆరోగ్యం క్షీణించిన 8 మంది విద్యార్థులను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ముప్పేట నిరాహార దీక్షలు కిరణ్ కుమార్ రెడ్డికి సమస్యగా మారాయి.

రాజకీయంగా తన ప్రభుత్వం ఏ మేరకు అస్థిరం పాలవుతుందనే ఆలోచన కూడా ఆయనను సతమతం చేస్తోంది. ఎఐసిసి ప్లీనరీ సమావేశంలో పాల్గొని మంగళవారం హైదరాబాదు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రోజంతా చంద్రబాబు దీక్షను ఎలా విరమింపజేయాలనే విషయంపైనే సమాలోచనలు జరిపారు. ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చంద్రబాబు దీక్ష విరమించడానికి నిరాకరించారు. వైయస్ జగన్ 48 గంటల పాటే దీక్ష చేస్తున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వైయస్ జగన్ బలప్రదర్శనకు దాన్ని వాడుకుంటున్నారు. ఎంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్తారనే సంశయం ఆయనను పీడిస్తూనే ఉంది. వైయస్ జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యులను ఎలా కట్టడి చేయాలనేది ఆయనకు పాలుపోవడం లేదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంతగా ఆందోళనల సమస్యలు లేవు. కిరణ్ కుమార్ రెడ్డి సత్తా తెలుసు కాబట్టే చంద్రబాబు, వైయస్ జగన్ అంతకన్నా తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటంలాంటిదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+