దివంగత సిఎం మరణించిన సెప్టెంబర్ 2 బ్లాక్ డే: నాగార్జున
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన సెప్టెంబర్ 2వ తేదిని బ్లాక్ డేగా ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున బుధవారం సాక్షి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. వైయస్ మృతి తర్వాత నాతో పాటు సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు అందరూ తాము ఏదో అనుకూలత కోల్పోయినట్టు ఉంటున్నారన్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో నాగార్జున కాంగ్రెస్ పార్టీని, వైయస్ ను సమర్థించిన విషయం తెలిసిందే. నాగార్జున ప్రచారం చేయనప్పటికీ అప్పుడు వైయస్ ను ముఖ్యమంత్రిగా సమర్థించారు.