చంద్రబాబుకు చిరంజీవి అండ: దీక్ష విరమింప చేయాలని సిఎంకు ఫోన్

Chiranjeevi
హైదరాబాద్: రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి బుధవారం మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై స్పందించి వారికి సరియైన న్యాయం చేసి చంద్రబాబు దీక్షను విరమింప చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. చంద్రబాబు దీక్షను విరమింపజేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రిని ఫోన్లో సంప్రదించారు. రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.

చంద్రబాబు దీక్ష చేపట్టిన సమయంలో అధికారం కోసమే ఆయన దీక్ష అంటూ ధ్వజమెత్తిన చిరంజీవి ఆరు రోజుల అనంతరం ఆయన దీక్షకు మద్దతు పలికారు. రైతు సమస్యలపై 48 గంటన నిరాహార దీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు పరామర్శించడం పార్టీ విప్ ను ధిక్కరించడం కిందకు రాదని ఆ పార్టీ నాయకులు రాంచందర్ రావు అన్నారు. ఇతర పార్టీ నేతలను జగన్ ఆహ్వానించటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

కాగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబును పరామర్శించారు. అయితే జేసి ప్రభుత్వం తరఫున కలిశారా, లేదా వ్యక్తిగతంగా కలిశారా అనేది తెలియడం లేదు. జెసి నిమ్స్ లోనికి వెళ్లే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని జెసిని లోనికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+