చంద్రబాబు, వైయస్ జగన్ లకు భయపడి కాదు: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి

S Jaipal Reddy
న్యూఢిల్లీ: నష్టపోయిన రైతులకు ఎవరు కూడా ఎప్పుడూ పూర్తిగా న్యాయం చేయలేరని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు. రైతులకు మొదటినుండి చారిత్రక న్యాయం జరుగుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా జోక్యం చేసుకున్న కారణంగానే రాష్ట్రానికి తక్షణ సాయంగా 400 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. మరింత సాయం అందే అవకాశం ఉందన్నారు. రైతులను ఆదుకోవడానికి, బీమా చెల్లింపులకు, వడ్డీ మాఫీలకు సోనియా, ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారని చెప్పారు.

రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలకు ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా రైతులు నష్టపోయారన్నారు. బాయిల్డు రైస్ ఎగుమతికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరామని అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. రైతులకు రుణసహాయం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులను వేరు చేసి చూడవద్దని చెప్పారు. ఇంతకుముందు కూడా ఈ సంవత్సరం కేంద్రం రాష్ట్రానికి 300 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలపై స్పందిస్తున్నాయన్నారు. సహాయానికి పద్దతి ఉంటుందని, ఆ పద్ధతి ప్రకారం వస్తాయన్నారు. రాష్ట్రంలో నష్టం అంచనా వేయడానికి ప్రతినిధి బృందాలు ఇంకా కొన్ని అక్కడే ఉన్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి కేంద్రం ఈ సహాయాన్ని ప్రకటించిందనటంలో వాస్తవం లేదన్నారు. ఇంతకుముందు స్పందించనంతగా కేంద్రం ఇప్పుడు రాష్ట్ర సమస్యలపై స్పందిస్తుందన్నారు. రాజకీయాలు మాట్లాడటానికి మేం ఎన్నికల మధ్యలో లేమని ఆయన చెప్పారు. కేంద్రం అధికారంలోకి రావడానికి అత్యధిక పార్లమెంటు సీట్లను సంపాదించి పెట్టిన ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తందనటంలో వాస్తవం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+