రెడ్డీస్ లో గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

Rangareddy District
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బొల్లారంలోని రెడ్డీస్ ల్యాబ్ లో బుధవారం ఉదయం విషపూరిత గ్యాస్ లీకేజి కారణంగా ఊపిరాడక ఇద్దరు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న వారిని కూకట్ పల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు విడుదలైన విషపూరిత గ్యాస్ కారణంగా శ్రీనాథ్, దీపక్ లు ఇద్దరు మృతి చెందారు. అయితే యాజమాన్యం ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచింది.

పోలీసులకు సైతం సమాచారం అందించలేదని తెలుస్తోంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరినట్టు తెలుస్తోంది. మృతుల బంధువులకు కూడా ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. యాజమాన్యం బాధ్యతారాహిత్యం కారణంగానే మృతి చెందినట్టు తెలుస్తోంది. యూనిట్ బి లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ యూనిట్లో పనిచేస్తున్న అప్పుడు ఈ ఆరుగురే పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+