వైయస్ జగన్ ఎఫెక్టుతో ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయి: రోజా

శంకర్ రావు అలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే మంత్రి పదవి లభించిందన్నారు. కాంగ్రెస్ ను అతికష్ట సమయంలో ఒంటి చేత్తో పోరాడి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. వైయస్ రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టేవారని ఆయన మార్గంలోనే రైతుల సమస్యల పరిష్కారం కోసం జగన్ చిత్తశుద్దితో దీక్ష చేస్తున్నారన్నారు. విలువలతో కూడిన రాజకీయం, మానవత్వంతో ఆయన పోరాటం సాగుతుందన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వం నామరూపాల్లేకుండా రాష్ట్రంలో కొట్టుకుపోతుందన్నారు. ప్రభుత్వాన్ని దింపే అవసరం జగన్ కు లేదని, ఆ పని రైతులే చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాట్లాడుదామని చెప్పారు.












Click it and Unblock the Notifications