వైయస్ జగన్ తన నిరాహార దీక్షను మరింత పొడగిస్తారా?

తన దీక్ష ప్రాధాన్యాన్ని తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో ప్రభుత్వం కుమ్మక్కయిందనే ఆలోచనలో వైయస్ జగన్ అన్నారు. ఇదే మాట సురేఖ కూడా అన్నారు. దీంతో దీక్షను పొడగించుకుని దాన్ని దెబ్బ కొట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతో ప్రభుత్వం కుమ్మక్కయిందని, అందుకే చంద్రబాబు దీక్షను పొడగించే ప్రయత్నం చేస్తోందని సురేఖ విమర్శించారు.
ఈ స్థితిలో వైయస్ జగన్ దీక్షను పొడగించుకోవడమే మంచిదనే అభిప్రాయంతో ఆయన వర్గీయులు ఉన్నట్లు చెబుతున్నారు. దానితో సంబంధం లేకుండా దీక్షను నిర్ణీత సమయానికే విరమించుకోవాలనే ఆలోచన కూడా సాగుతోంది. అలా అయితే, జగన్ చేత ఆయన తల్లి, దివంగత నేత వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మ దీక్ష విరమింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దానివల్ల ప్రజల సానుభూతి మెండుగా లభిస్తుందని వైయస్ జగన్ వర్గం ఉంది.












Click it and Unblock the Notifications