రైతులు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు: ఎర్రంనాయుడు

రైతులపట్ల కనికరం లేని ముఖ్యమంత్రికి మంచి ఆలోచన ఇవ్వాలని ఆ దేవుడిని పార్థిస్తున్నానని ఆయన చెప్పారు. అద్బుత సాయం అని ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుందని, అద్బుతమైన సాయమే అయితే రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. రైతుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో సహా అన్ని పార్టీల వారు ఈ సాయం సరిపోదని చెబుతుంటే ప్రభుత్వం వినిపించుకోవటం లేదన్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేకుండా పోయిందన్నారు.












Click it and Unblock the Notifications