వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ మధ్య సయోధ్య?

YS Vivekananda Reddy
కడప‌: బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ కు మధ్య సయోధ్య కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ మామ గంగిరెడ్డి నివాసంలో ఇద్దరి మధ్య జరిగిన చర్చలు కొంత ఫలితం ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి కడప జిల్లాలోని పులివెందులలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. వైయస్ జగన్, వివేకానంద రెడ్డి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనని క్యాడర్ భావిస్తోంది.

తాను కాంగ్రెసు వెంటే ఉంటానని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తానని అంటూ వచ్చిన వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ విషయంలో మెతకపడినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సయోధ్య కుటుంబపరంగానే కొనసాగుతుందా, రాజకీయంగా కూడా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, కుటుంబపరంగా తాను వైయస్ జగన్ తో కలిసి ఉంటానని వైయస్ వివేకానంద రెడ్డి గతంలో చెప్పారు. అయితే, ప్రస్తుతం కుదిరిన సయోధ్య కడప పార్లమెంటు నియోజకవర్గానికి, పులివెందుల శాసససభా నియోజకవర్గానికి ఉప ఎన్నికలనాటికి రాజకీయంగా కూడా బలపడుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+