వైయస్ జగన్ నోట ఎన్టీఆర్ మాట: చంద్రబాబుపై ధ్వజం

చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తుంటే తమకు తెలియదని ప్రభుత్వం అంటోందని, ప్రభుత్వం నిద్రపోతోందా అని అడుగుతున్నానని ఆయన అన్నారు. చేనేత కార్మికుల ఆకలి కేకలు వినాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం వైయస్సార్ ప్రకటించిన ప్యాకేజీ ఏమైందని ఆయన అడిగారు. చేనేత కార్మికుల కోసం పావలా వడ్డీకే లక్ష రూపాయల రుణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నూలు ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications