వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి

Sabbam Hari
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో వచ్చే సంవత్సరంలో మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వందలాది మంది ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆదివారం తెలిపారు. దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు తమను గౌరవిస్తున్నారని వారు అంటున్నారని, అందుకే వారు ఓదార్పులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.

విశాఖలో జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్ర ఇంతకుముందు ఓదార్పు యాత్రలు విజయవంతమయినట్టే విజయవంతమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం జవనరి 2వ తేది నుండి జగన్ ఓదార్పు యాత్ర విశాఖలో ప్రారంభమవుతుంది.కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి భూమా దంపతుల ఆధ్వర్యంలో జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+