వైయస్సార్ గుడ్డిగా సంతకం పెట్టారా?: బయటపెట్టిన ఆంధ్రజ్యోతి డైలీ

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఓ ఫోర్జరీ ఉదంతాన్ని ప్రముఖ తెలుగుదిన పత్రిక ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ఆ వార్తాకథనం ఇలా ఉంది - అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక వినతిపత్రం అందింది. 'ప్లీజ్ ట్రాన్స్‌ఫర్ ఇ.సుబ్బారాయుడు, డీఎస్పీ-విజయనగరం (పీటీసీ)-కదిరి (సబ్ డివిజన్). కంది కుంట ప్రసాద్ (ఎంఎల్ఏ)-కదిరి, వరదాపురం సూరి-ధర్మవరం కంటెస్టెడ్ క్యాండిడేట్'... ఇదీ ఆ వినతిపత్రం పూర్తి పా ఠం! ఇది ఇంగ్లీష్‌లో రాసిన వినతిపత్రం. అది పాలిష్డ్ ఇంగ్లీష్ కూడా కాదు. ఎడమ చేత్తో గెలికినట్లుగా, కొక్కర గీతలు! ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో లేదు. ఎవరు రాశారో కూడా లేదు. కింద మాత్రం కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ (అందులోనూ ఒక కొట్టివేత!). ఈ వినతిపత్రం ఎమ్మెల్యే అధికారిక లెటర్‌హెడ్‌పై కూడా లేదు. అదో తెల్ల కాగితం! దానిపై ఓ అనామకుడి రాత! మామూలు పరిస్థితుల్లో దీనిని చెత్తబుట్టలో పడేయాలి. కానీ, నాటి సీఎం వైఎస్ కళ్లకు ఇది బాగా అవసరమైన పత్రంలాగా కనిపించింది. దీనిపై 'డీజీపీ, ప్లీజ్ డిస్కస్' అని సంతకం చేసి, తేదీ (25/8/2009) వేసేశారు. అప్పటి డీజీపీ యాదవ్.. వైఎస్‌తో ఏం 'డిస్కస్' చేశారో తెలియదు గానీ చకచకా ఫైళ్లు కదిలాయి.

ఈ వినతిపత్రాన్ని స్వయంగా విపక్ష ఎమ్మెల్యే రాసినట్లుగా నాటి సీఎం కార్యాలయం కూడా విశ్వసించింది. సీఎం కార్యాలయం నుంచి నాటి సీఎంవో ప్రధాన కార్యదరి జన్నత్ హు స్సేన్ పేరిట డీజీపీకి ఒక ఆదేశం వెళ్లింది. 'ఎమ్మెల్యే విన్నపం మేరకు, సుబ్బారాయుడిని విజయనగరం నుంచి కదిరి డీఎస్పీగా బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోగలరు'...ఇదీ ఆ లేఖ సారాంశం. వైఎస్‌కు 'ఎస్ బాస్' అనడం తప్ప మరోమాట తెలియ ని అప్పటి డీజీపీ యాదవ్ ముందూ వెనుక చూసుకోకుండా ఈ ఉత్తర్వులను తు.చ.తప్పకుండా పాటించారు.

మట్కా భూషణ్, 'సారా క్వీన్' భవాని...కదిరి ప్రాంతంలో ఈ పేర్లు బాగా 'ఫేమస్'. ఇక లిక్కర్ సిండికేట్ గురించి చెప్పక్కర్లేదు. వీరందరి అక్రమాలకు డీఎస్పీ సుబ్బారాయుడు అండగా నిలుస్తున్నారు. ఈ ఆరాచకాలతో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విసిగిపోయారు. ఇలాంటి అధికారిని తమకెందుకు అంటగట్టారంటూ నెత్తీ నోరు కొట్టుకున్నారు. 'అదేంటి సార్! సుబ్బారాయుడిని కోరి తెప్పించుకుంది మీరే కదా!' అని పోలీసు ఉన్నతాధికారులు బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఇక ఈ విషయమేంటో తేల్చుకోవాలని సచివాలయానికి వచ్చారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి జె.సత్యనారాయణను కలిశారు. డీఎస్పీ బదిలీపై తాను ఎలాంటి సిఫారసులు చేయలేదని, దీనికి సంబంధించిన నోట్‌ఫైల్స్, కాగితాలు చూపాలని కోరారు. అవి చూడటంతో మొత్తం విషయం బయటపడింది. ఊరూ పేరూ లేకుండా రాసిన వినతి పత్రంపై నాటి సీఎం స్పందించినట్లు స్పష్టమైంది.

వైఎస్ హయాంలో పోలీసు అధికారులకు సంబంధించి అధికారిక బదిలీలకంటే...రాజకీయ బదిలీలే అధికమనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుబ్బారాయుడు గతంలో అనంతపురం జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ఆయన ఉంటే తమకు అడ్డే ఉండదని...మట్కా, మద్యం లాబీ భావించింది. అనంతపురం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కథ నడిపారు. వీరికి కడప జిల్లాకు చెందిన ఒక ప్రముఖుడు సహకరించారు. డీఎస్సీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేసి మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+