గన్ పార్కు వద్ద కాంగ్రెసు తెలంగాణ నేతల నిరవధిక దీక్ష ప్రారంభం

అనంతరం గన్ పార్కు వద్దకు ర్యాలీగా వచ్చి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీక్షను ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు గన్ పార్కు వద్ద బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి పంపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే అవసరమైన పక్షంలో మంత్రులు కూడా దీక్షలో పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినుండి, పెద్దల నుండి ఫోన్ లు వచ్చినప్పటికీ తెలంగాణ కోసం తమ బాధ్యతలు నిర్వహిస్తామని చెప్పారు.
కాగా తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు చేస్తున్న దీక్షకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు మద్దతు పలికారు. తెలంగాణ ఇవ్వకుంటే జనవరి 1 తర్వాత ప్రజా ప్రతినిధులు అందరూ రాజీనామాకు సిద్ధపడాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోడలు పొన్నాల వైశాలి ప్రకటించారు. లేదంటే వారిని తెలంగాణ ద్రోహులుగా గుర్తించ వలసి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications