దీక్ష విరమించండి: కాంగ్రెసు ఎంపీలకు తెలంగాణ మంత్రుల వినతి

మిగతా కేసులను సత్వరమే పరిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం సాగిస్తామని, తామంతా ఒకే మాట మీద ఉంటామని మంత్రి బసవరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తామని, అలా ఒప్పించాలని బాధ్యత అందరి మీదా ఉందని ఆయన చెప్పారు.
కాగా, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుకు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. 135 కేసులు ఎత్తివేస్తున్నామని ఆమె చెప్పారు. అయితే, మొత్తం కేసులు ఎత్తేసేవరకు దీక్ష విరమించేది లేదని కేశవ రావు హోం మంత్రితో చెప్పారు.












Click it and Unblock the Notifications